Times Now Survey: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్‌సీపీ విజయం తథ్యమని వెల్లడించింది. ఏకపక్షంగా ఆ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపింది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉంటుందని.. కానీ ఫలితంలో ఏ మాత్రం తేడా లేదని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది. టీడీపీ ఒక ఎంపీ స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే చెప్పింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైసీపీకి ప్రజాదరణ పెరగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్
ఇదిలా ఉండగా.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 9 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించగా.. బీజేపీ 2 నుంచి 3 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులు కూడా ఓ స్థానంలో గెలుపొందే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ విడుదల చేసింది.
Times Now-@ETG_Research Survey
Lok Sabha 2024 | Andhra Pradesh: Total Seats: 25
Seat Share:
– YSRCP: 24-25
– TDP: 0-1
– JSP: 0
– NDA: 0
– Others: 0TDP has to re-invent itself: @ashutosh83B
Jagan Mohan Reddy is delivering his promises: @AbbayaChowdary tells @padmajajoshi pic.twitter.com/Eg6JSYXg8G
— TIMES NOW (@TimesNow) October 2, 2023