*నేడు తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన
నేడు తెలంగాణ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను తెలంగాణ ప్రజలకు మోడీ అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు.
*నేడు తెలంగాణలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన
ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సారథ్యంలోని 17 మంది అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్‌కృష్ణాలో బస చేయనున్నారు. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ లతో ఈసీ సమావేశం కానుంది. సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల రిలీజ్ కాబోతుంది.
*నేడు జగిత్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన
నేడు జగిత్యాలలో ఐటీ& పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల పట్టణంలో 322.90 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 8:50 గంటలకు మంత్రి కేటీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలు దేరి 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం హెలిపాడ్ దగ్గర 9:45 నిమిషాలకు చేరుకుంటారు.. ఉదయం 10 గంటలకు మొదట జిల్లా కేంద్రంలో నూతనంగా 38 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
*నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక, నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ విచారణ చేయనుంది. జాబితాలో చిట్టచివరి కేసు(63వ నెంబర్)గా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును చంద్రబాబు తరపు లాయర్లు ఆశ్రయించారు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు రాగా.. విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు.
*తిరుమలలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్..
తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కిడ్నాప్ చేశారు. అయితే, శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన కుటుంబం వచ్చింది. చెన్నైకి చెందిన చంద్రశేఖర్- మీనా దంపతుల రెండో కుమారుడు మురుగేశన్ గా గుర్తించారు. అర్ధరాత్రి 2.20 నిమిషాలు సమయం బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. కిడ్నాపర్ వయస్సు 32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ వైట్ షూ…గ్రీన్ కలర్ షర్ట్ తో వేసుకుని ఉన్నాడు.. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్ళినట్లు క్లూస్ దొరికాయి.. కిడ్నాపర్ కోసం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
*యశస్వి జైస్వాల్ సెంచరీ.. నేపాల్‌కు భారీ టార్గెట్..!
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో భారత్, నేపాల్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.