ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.. దీని కోసం ఇవాళ ఉదయం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకుంటారు.
గోదావరి డెల్టాకు రబీకింద సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు సీఎంఓ అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్‌ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు.
ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఉదయం 12 గంటలకు సీఎం జగన్ రాయచోటి చేరుకోనున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ కుమారుడు వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
రాష్ట్ర విభజన హామీలకు తూట్లు పొడిచిన కేంద్రంలోని మోడీ పాలనను సాగనిద్దామా..? సాగనం పుదామా..? అని సీపీఎం నేతలు ప్రశ్నించారు. గత తొమ్మిదిన్నరేళ్లలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా ల ఒకొక్కటిగా వివరించారు. అనాలోచిత ఆర్ధిక విధానాలతో ఆర్ధిక అసమానతలను పెంచడంతో పాటు మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని మండి పడ్డారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అందరికీ సమానత్వం రావటమే సాధికారత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చట్టసభలలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ప్రాధాన్యత రావడమన్నారు.