రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. పుట్టపర్తి బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని వెల్లడించారు. పేదలకు అండగా నిలబడి వారికి గుండె చప్పుడుగా ముఖ్యమంత్రి మారారన్నారు.
విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో కనుమరుగయ్యే పార్టీ జనసేన పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిత కోసం ఎంతో మంది పోరాటాలు చేశారని మంత్రి చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. యాత్రకు వెళ్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు.
జగనన్న ఆరోగ్య సురక్ష, 'వై ఏపీ నీడ్స్ జగన్' క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. దాదాపు 98శాతం గ్రామ, 77 శాతం వార్డు సచివాలయాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ మాట వచ్చిన అది జీవో కింద లెక్క అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని కూడా వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపర మేధావిని అన్నట్టు సజ్జల ఫీలవుతున్నారని ఆయన విమర్శించారు.
దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి నిజమే గెలవాలంటుందని, మేము అదే అంటున్నాం నిజమే గెలవాలని అని ఆయన స్పష్టం చేశారు.