మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభించారు.
గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
అనకాపల్లిలో మంత్రి అమర్‌నాథ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై మండిపడ్డారు హౌసింగ్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరిపించాలని పీలా గోవింద్ ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో మరికొన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఎల్లుండి(నవంబర్ 3)కి వాయిదా వేసింది.
క్రీడలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొ్న్నారు. నవంబరు 1 నుంచి 2023 సబ్ జూనియర్ టోర్నమెంట్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి డిక్లేర్ చేశారు.
చట్టసభల్లో స్థానమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో నూర్ బాషా దూదేకుల సింహగర్జన కార్యక్రమం జరుగుతోంది. వైసీపీ యువనేత జాన్ సైదా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జగన్మోహనుడిని అంటే..ఈ చరాచర సృష్టిని పాలించే విష్ణుమూర్తి అంశమే జగన్మోహనుడు అని..అటువంటి దైవాన్ని ఒక రాక్షసునిగా ఏ ఉద్దేశంతో టీడీపీ నేతలు చిత్రీకరించారో యావత్ భారతీయులకు వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు.