ఏ కాలంలో అయినా డబ్బులు వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది మద్యం వ్యాపారమే. పరిస్థితి ఎలా ఉన్నా.. రేటు ఎలా ఉన్నా మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు ఎగబడతారు. అందులోనూ ఇక ఉచితంగా దొరికితే వదిలిపెట్టే సమస్యే లేదు.
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి అని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లా కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటనలో ఉండనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అభి ఫంక్షన్ హాల్‌కు చేరుకొని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ఫర్సన్ జకీయా ఖానం కుమారుడు ముష్రఫ్ అలీ ఖాన్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి మరో క్యాంపెయిన్ చేపట్టనుంది. నేటి(గురువారం) నుంచి వైసీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.