ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి-వెలుగు అని సీఎం పేర్కొన్నారు.
డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు జనాలు. బంధాలు, అనుబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బంధువులు అని కూడా చూడకుండా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.