Why AP Needs Jagan: మరో క్యాంపెయిన్‌కు వైసీపీ శ్రీకారం.. నేటి నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why AP Needs Jagan: వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి మరో క్యాంపెయిన్ చేపట్టనుంది. నేటి(గురువారం) నుంచి వైసీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, పార్టీకి సంబంధించిన కేడర్ పాల్గొంటారు. ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ యా సచివాలయాలకు జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. అదే సమయంలోవైసీపీకి సంబంధించిన గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ మండల స్థాయి నేతలు గత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తారు.
Also Read: TDP-Janasena: మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా.. నేడు టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
2014లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని విషయాలను ప్రజలకు వివరిస్తారు. ఏడాదికి 12 గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ వంటి వైఫల్యాలు వివరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు అంశాలు ఉంటాయి. మొదటి రోజు సచివాలయాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఆ సచివాలయ పరిధిలో ఎంత మందికి ఏ ఏ పథకాల కింద ప్రయోజనం కలిగింది, ఎంత మేరకు కలిగింది, అదే విధంగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎంత వెచ్చించింది వంటి విషయాలతో కూడిన బోర్డులను ప్రదర్శిస్తారు. మరోవైపు పార్టీ వైపు నుంచి మొదటి రోజు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతారు. అనంతరం స్థానికంగా ప్రభావిత వ్యక్తులు, వర్గాలు, బృందాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రాత్రికి పార్టీ క్యాడర అదే సచివాలయ పరిధిలో విడిది చేసేటట్లు కార్యక్రమ రూపకల్పన చేశారు. రెండో రోజు సచివాలయ పరిధిలోని ప్రతి గడపను సందర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి ఉన్న తలసరి ఆదాయం, అభివృద్ధి రేటు వంటి ప్యారామీటర్స్, ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులను వివరిస్తారు.
Also Read: CM YS Jagan: నేడు, రేపు సీఎం జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటన
చేసిన పనుల్ని గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచబోతోంది వైసీపీ. డిసెంబర్ 19 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ అనే క్యాంపెయిన్ కొనసాగనుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని కొందరు ఆరోపిస్తున్నారు.. మరికొందరు శ్రీ లంకగా మారుతుందని అన్నారు.. వాస్తవంగా జీఎస్‌డీపీలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. గురువారం నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. 4 లక్షల 90 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో చంద్రబాబు హయాంలో ప్రతికూల వృద్ధి రేటులో ఉండేదని.. ఇప్పుడు గణనీయంగా ప్రగతి సాధించామన్నారు.. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారు.. జగన్ అభివృద్ధి చేశారు.. వైద్య రంగంలో కూడా ఎన్నో సదుపాయాలు కల్పించారు.. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేశారు.. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 5 కోట్ల మందికి వైద్య సేవలు అందించాం.. నాలుగేళ్లలో కొత్తగా నాలుగు ఓడరేవులు.ఎం 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి.. మౌలిక సదుపాయాల రంగంలో రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది అని గుర్తు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!