మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. జనసేన-టీడీపీ- బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవలసి ఉందని చెప్పగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారన్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి.
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 10 సెంట్ల స్థలం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. భర్తకు గల పది సెంట్ల స్థలం అమ్మమని గత కొన్నాళ్ళ నుంచి ఒత్తిడి చేస్తుంది.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలికి.. స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు.
అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. జీతాలు పెంచాలని అంగన్వాడీ సంఘాలు పట్టుబట్టాయి. ఇప్పటికిప్పుడు పెంచలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.
సంక్రాంతి తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు జిల్లాల చొప్పున సీఎం పర్యటించనున్నారు.
అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమయ్యాయి. 2024 జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. జీతాల పెంపుపైనే అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పట్టుబట్టారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి జీతాలు పెంచుతాం అని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుండి కౌతాళం మండలం హాల్వి గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డును చూసి, నిరసన వ్యక్తం చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి.