కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను ఆవిష్కరించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.
ల్లుండి విజయవాడలో అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్ అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది.