విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నన్ను తప్పించి మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానం ఇష్టమన్న ఎమ్మెల్యే ఆర్థర్.. గతంలో కూడా వేరే వాళ్ళను తప్పించి తనకు టికెట్ ఇచ్చారని వెల్లడించారు.
సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని సీఎం వెల్లడించారు.
AP Ministers: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ మంత్రులు ప్రసంగించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏదైనా గ్రాఫిక్సేనని.. ఇది చారిత్రాత్మకమైన ఘట్టం అంటూ మంత్రి వెల్లడించారు. జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ ముఖం…
ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆలస్యంగా చర్యలు చేపట్టింది. అప్పట్లో తిరుపతి ఆర్వోగా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా ఐఏఎస్‌పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు లిస్ట్‌లను విడుదల చేసిన వైసీపీ అధిష్ఠానం ఐదో జాబితా కోసం కసరత్తు మొదలుపెట్టేసింది. నాలుగు లిస్టుల్లో ఊహించని వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదో జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
పీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు.