రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు - నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.
అమ్మ అంటే అనురాగం.. కమ్మదనం.. ఒక దైర్యం. అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు లేడు అని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచే తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు.
టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. మరోవైపు లక్కిడిప్ విధానంలో పొందే ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగూల్మంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై విద్యుత్ జేఏసీ - యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. సింగిల్ మాస్టర్ స్కేల్‌తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సంతకాలు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఆయన ఎద్దేవా చేశారు.
Rk Roja: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ.. తన అభిమాన సంఘాలనే కాకుండా ప్రజలను కూడా తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటికి నిన్న గాజువాకలో జరిగిన సభలో జగన్ పై పవన్ మరోసారి దుమ్మెత్తిపోశారు.