చట్టం ప్రశ్నించినపుడు ఎవరైనా సిద్ధపడాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సీఎం జగన్ కేసుల వెనుక రాజీయ ప్రేరేపితం ఉందని ప్రజలు తెలుసుకున్నారని.. చంద్రబాబు లాగా కేసుల గురించి జగన్ కన్నీళ్లు పెట్టుకోలేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది.
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వమన్న మంత్రి రోజా.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.
వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడతాడు. అందుకే సమాజంలో వైద్యులకు విశేష ప్రాధాన్యత కట్టబెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు.