నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేయర్ పొట్లూరి స్రవంతి షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి దూరమైన తర్వాత మేయర్ స్రవంతి ఆయన వైపే నిలిచారు. ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో మేయర్ స్రవంతికి విభేదాలు తలెత్తాయి.
నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నందిగామలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా విధుల బహిష్కరణకు నందిగామ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. స్కిల్ డెవలప్మెంట్‌కేసులో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందన్నారు. బంద్‌కు పిలుపునిస్తే ప్రజల్లో స్పందన లేదన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ యువకులకు సంబంధించిందని.. ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వకుండా , ఇన్స్టిట్యూట్ కట్టకుండా డబ్బులు కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలన్నారు. అవినీతి చేసిన వారు ఎవరైనా శిక్షింపబడాల్సిందేనన్నారు.