Janasena Party: ఉత్కంఠకు తెర.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఆ మూడు పెండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుల్లో భాగంగా.. 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది జనసేన పార్టీ.. అయితే, జనసేన ఇప్పటికే ప్రకటించిన లిస్ట్‌లో మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.. ఎన్నికల తరుణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. జనసేనలో చేరారు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి.. కానీ, ఇప్పటి వరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేయకపోవడంతో.. బాలశౌరి పొలిటికల్ ప్యూచర్ ఏంటి? అనే చర్చ సాగింది.. ఇదే సమయంలో.. మరికొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. మొత్తంగా.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థినిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
Read Also: Bharat Ratna : భారతరత్న అవార్డు అందుకున్న పీవీ తనయుడు ప్రభాకర్ రావు
Also Read
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ తరుపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేసినట్టు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసన సభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని.. కానీ, అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని.. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. సర్వేకు సంబంధించిన ఫలితాలు వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది జనసేన. అయితే, మొత్తంగా చూస్తే ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగులో పెట్టింగ్‌లో పెట్టింది జనసే.. అందులో ఒకటి విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. కానీ, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లల్లో కసరత్తు కొనసాగుతోంది.. త్వరలోనే ఆ మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?