Harirama Jogaiah: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వరుసగా లేఖ రాస్తూ వచ్చిన కాపు సంక్షేమసేన వ్యవస్థాపకులు, మాజీ మంత్రి చేగోండి హరిరామ జోగయ్య.. పొత్తులు, సీట్లు, సర్దుబాట్లపై సూచనలు చేస్తూ వచ్చారు.. పొత్తులతో ఎదురయ్యే పరిస్థితులను వివరిస్తూ.. పవన్ కల్యాణ్ నిర్ణయాలను తప్పుబడుతూ ఆయన లేఖలు రాశారు.. టీడీపీ తొక్కేస్తుంది.. మిమ్మల్ని వాడుకుని వదిలేస్తుంది అని హెచ్చరించారు.. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని.. కూటమిలో చేరొద్దని.. ఇలా చాలా సూచనలిచ్చారు.. ఆయన రాసిన లేఖలపై విమర్శలు రావడంతో పాటు.. ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, తొలిసారి.. పవన్ కల్యాణ్ విజయం కోసం పనిచేయాలని హరిరామ జోగయ్య లేఖ రాశారు..
Read Also: Mansukh Mandaviya: ఇంతకీ నీవు కేంద్ర మంత్రివా.. టీమిండియా ప్లేయర్వా..
ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కు లేఖలు రాసే హరిరామ జోగయ్య.. ఈ సారి కాపు బలిజ సంక్షేమ సేన ఆఫీస్ బేరర్లు, సభ్యులకు లేఖ రాశారు.. ఈ రోజు నుంచి పిఠాపురంలో మొదలై సుమారు 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. జనసేన అభ్యర్థులను పోటీలో పెట్టిన 21 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ద్వారా ప్రజలను కలిసి.. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పర్యటించదలుచుకున్న విషయం మీకు తెలియనిది కాదని లేఖలో పేర్కొన్నారు.. అయితే, పవన్ కల్యాణ్ పర్యటనలో కాపు, బలిజ సంక్షేమ సభ్యులందరూ భాగస్వాములు కావాలని.. జనసేన అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేయాల్సిందిగా ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు కాపు సంక్షేమసేన వ్యవస్థాపకులు, మాజీ మంత్రి చేగోండి హరిరామ జోగయ్య.
