బయట నుంచి చూస్తే అది స్పా సెంటర్.. కానీ, లోపల జరిగే తంతాంగం వేరే.. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్ లోని ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సెలూన్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనలో 12 మంది ఉండగా 11 మంది పట్టుబడ్డారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.
మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీలో పొలిటికల్ రచ్చ సాగుతూనే ఉంది.. ఈ అంశంపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు.. చరిత్ర చెరిపేస్తే చెరగదు.. రాష్ట్ర చరిత్రలో ఒకేరోజు ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత మా నాయకుడు జగన్ కే దక్కుతుందన్నారు..
జిల్లా కలెక్టర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సంక్షేమం, పీ4, సూపర్ సిక్స్ అంశాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమీక్షించిన ఆయన.. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.. సంక్షేమం - అభివృద్ధిని సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నాం.. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం అందరికీ అందించాం అని…