CM Chandrababu: అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది..
- అన్నదాతలు ఆందోళన చెందవద్దు..
- రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..
- అది నమ్మే ప్రభుత్వం మాది-సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతు సమస్యలపై, గిట్టుబాటు ధరలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న తరుణంలో ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా… ఒకడుగు ముందుకు వేసి వారికి అండగా నిలుస్తున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతో 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతులు ఉల్లి పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి వారికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ – పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. ఆర్థికంగా ప్రభుత్వంపై భారమైనా…రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నాం..” అని పేర్కొన్నారు..
Read Also: H-1B visa: ట్రంప్ H-1B వీసా నిబంధనలతో ఎవరిపై ప్రభావం .? ఎవరిపై ఉండదు..?
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఇక, “ఇదొక్కటే కాదు…15 నెలల కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా ఉండే విషయంలో ఎప్పుడూ వేగంగానే స్పందించాం. PM Kisan – అన్నదాత సుఖీభవ కింద రూ.3200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మామిడి రైతులు మద్దతు ధర కోల్పోతే రూ.260 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా HD పొగాకు ధర పతనమైతే రూ.271 కోట్లు ఖర్చు చేసి వారికి భరోసా కల్పించాం. రూ.14 కోట్లు ఖర్చు చేసి కోకో గింజలకు కిలోకు రూ.50 లు చెల్లించాం. కాఫీ పంటకు బెర్రీ బోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు కేజీ కాఫీకి రూ.50లు నష్టపరిహారం ఇచ్చి గిరిజన రైతులకు సాయంగా నిలిచాం. టమాటా రైతులు నష్టపోకుండా మద్దతు ధర లభించేలా రూ.12 కోట్లు ఖర్చు చేసి మార్క్ ఫెడ్ ద్వారా సేకరించి ఆదుకున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు అకౌంట్లలో వేశాం. 15 నెలల కాలంలో ధాన్యం కొనుగోలుకు రూ. 13,500 కోట్లు ఖర్చు చేశాం. రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. అన్నదాతలు ఎవరూ ఏ విషయంలోనూ ఆందోళన చెందవద్దు. మెరుగైన సాగు పద్ధతులు పాటిస్తూ…. డిమాండ్ ఉన్న పంటలు సాగుచేస్తూ… ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ…. సాగును లాభదాయకం చేసుకుందాం..” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
#FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా….ఒకడుగు ముందుకు వేసి వారికి అండగా నిలుస్తున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు…— N Chandrababu Naidu (@ncbn) September 20, 2025
తాజావార్తలు
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?