CM Chandrababu: పల్నాడు జిల్లా మాచర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (సెప్టెంబర్ 20న) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే, ముందుగా యుదవుల బజారులో జరుగనున్న స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, పారిశుధ్య కార్మికులతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం హెల్త్ క్యాంప్‌ను పరిశీలించి, స్వచ్చ రథాన్ని జెండా ఊపి ఆరంభిస్తారు. ఆ తర్వాత ఎస్కేబీఆర్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
Read Also: H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు
ఇక, ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దిశనిర్ధేశం చేసే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే, మాచర్లలో భారీగా పోలీసులను మోహరించారు.