Machilipatnam: మచిలీపట్నం పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ” ర్యాలీకి అనుమతి నిరాకరించినప్పటికీ, ఆ పార్టీ్కి చెందిన నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు, సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. కానీ, వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Wives M*urder: మృగాలు నయంరా.. వణికించిన హత్యలు.. భార్యలను కిరాతకంగా చంపిన భర్తలు
ఇక, వైసీపీ నేతలు పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, ఉప్పాల రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాష్ తో పాటు సుమారు 400 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, విధుల్లో ఉన్న పోలీసుల పనికి ఆటంకం కలిగించడంతో పాటు పోలీస్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.