IAS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు సంక్షేమం మరోవైపు.. స్థిరమైన పాలనపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సుదీర్ఘ కసరత్తు చేస్తూ.. అధికారులను బదిలీ చేస్తున్నారు.. ఈ మధ్యే సీనియర్ ఐఏఎస్ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు.. వివిధ శాఖల అధిపతులను మారుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా, మరో తొమ్మిది మంది IAS అధికారులను బదిలీ చేసింది..
బదిలీ అయిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు:
1. ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్ గా ప్రశాంతి
2. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్
3. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరక్టర్‌గా శ్రీధర్ చామకురి
4. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి
5. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్.
6. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా నవీన్.
7. ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం.
8. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా వెంకటేశ్వర్లు.
9. ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్‌ను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు..