అంబేద్కర్ జయంతి ముందు రోజు సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఇది చేతకానితనం వల్ల చేసే పిరికిపంద చర్యగా చెపుతున్నామన్నారు. ఇలాంటి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ అంటే భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ బలం లేక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నారని.. జగన్ కి జనం నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి తట్టుకోలేక దాడులు…
రాయి దాడితో సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్దం..?అని తెలిపింది. మరీ అవసరమైతేనే జగన్ బస్ పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలకు అనుమతి ఇచ్చింది. క్రేన్లు ఆర్చులు, భారీ గజమాలలను తగ్గించాలని సూచించింది. జగన్ కు, జనానికి మధ్య గతంలో మాదిరిగా బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అనంత జిల్లా గుత్తిలో సీఎం జగన్ కాన్వాయిపై చెప్పులు, ఇప్పుడు రాళ్లు విసరడంతో నిఘా…
సీఎం జగన్‌పై దాడి దారుణమని.. దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నానన్నారు. సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అని ఆమె ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అంటూ ఆమె తెలిపారు.
విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి విదితమేయ తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.