Teacher Harassment: ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకు కొందరు కీచకులు లైంగికంగా వేధిస్తుంటారు. తమ కామ కోరికలను తీర్చుకునేందుకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే, ఈ విధమైన లైంగిక చర్యలు ప్రతి చోటు జరుగుతునే ఉన్నాయి. కానీ.. అందరికి చదువు చెప్పే ఉపాధ్యాయులే కామ రాక్షసులు అయితే.. అక్కడ చదివే పసి పిల్లల భవిష్యత్ సర్వ నాశనం అవుతుంది. అలాంటి కీచక టీచర్ చేసిన పని ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి నెలకొంది. చిన్నారిపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. రామానందసాగర్ అనే ఉపాధ్యాయుడిపై బాలిక ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నెహ్రూనగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఏడు సంవత్సరాల మైనర్ బాలికపై ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు బి.రామానంద సాగర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది.
Read Also: Punjab : చాక్లెట్లు తిన్న చిన్నారులకు రక్తపు వాంతులు.. ఆగ్రహించిన కుటుంబసభ్యులు
బాలిక పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించగా… విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులు ఏం జరిగిందని పలుమార్లు ప్రశ్నించినా చెప్పలేదు. స్కూల్‌కు వెళ్లనని భయపడుతున్న బాలికను తల్లి మందలించడంతో జరిగిన విషయం.. ఆ చిన్నారి తన తల్లికి చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.