Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైసీపీలోకి 35 కుటుంబాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానన్నారు. సీఎం జగన్ పాలనలో చేసిన మంచి, జరిగిన అభివృద్ధి చూసి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పిలుపునిచ్చారు.
Read Also: Betul Accident : లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తిరిగి వస్తున్న సైనికుల బస్సు బోల్తా
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
ఇక, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పేదల పార్టీ అని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారని నంబూరి శంకరరావు తెలిపారు.
Read Also: K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్ పై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
అయితే, అక్కచెల్లమ్మలకు ఆసరా కల్పించారు అని ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు. అన్న దాతలకు భరోసా ఇచ్చారు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.. పాఠశాలలు బాగు చేసి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని వెల్లడించారు. తాను కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాను.. అమరావతి – బెల్లంకొండ రోడ్డు, అమరావతి – తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి పూర్తి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో 27 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. కాగా, 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆర్ధికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఆస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారన్నారు.
Read Also: PM Modi: యువరాజుకి వయనాడ్లో కూడా ఓటమి భయం పట్టుకుంది..
అలాగే, ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు చెప్పారు. సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని.. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రానికి రోల్ మోడల్ గా మార్చి మీ చేతుల్లో పెడతానని పేర్కొన్నారు. తాను చేసిన మంచిని చూసి తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. మళ్లీ జన్మభూమి కమిటీల అరాచకాలు మొదలవుతాయన్నారు. మనం ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి – బెల్లంకొండ రోడ్డు, మదయదూరు బ్రిడ్జి మళ్లీ కడతానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతన్న చంద్రబాబు పాలన మనకు అవసరమని నంబూరు శంకరరావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!