సీఎంకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ను విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి
ఒంగోలు లోక్ సభ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తు్న్న ఆయన.. ఈ రోజు బేస్తవారిపేటలో ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎన్నికల తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి గానీ, నాయకులు గానీ.. మా గ్రామంలోకి రావొద్దు అని హెచ్చరిస్తూ మాగపువారిపేట గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం మాగపువారిపేటలో ఈ వార్నింగ్ ఫ్లెక్సీలు కలకలం రేపుపుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీకి గుడ్బై చెప్పారు.. ఇక, ఆయన బాటలో ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా అడుగులు వేశారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.