Minister Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు..
- ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు..
- క్యాంపస్ లో గంజాయి వినియోగంపై మంత్రి లోకేశ్ సీరియస్..
- త్వరలోనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి నారా లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Lokesh: పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై మంత్రి సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: UP : సామూహిక అత్యాచారం.. న్యాయం కోసం ట్యాంక్ ఎక్కి అక్కడే నిద్రపోయిన బాధితురాలు
Also Read
ఇక, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల నుంచి తమ పిల్లల్ని పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ చేర్పించి తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజా దర్బార్ లో మంత్రి లోకేష్ ని కలిసి తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. క్యాంపస్సులో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మార్కులు పరంగా ఫెయిల్ అవుతున్నారని పేర్కొన్నారు. పదో తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిన తమ పిల్లలకు ఇంటర్ లో సిబ్బంది.. ఇంటర్నల్ మార్క్స్ విషయంలో నిర్లక్ష్యం వహించి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. లోపభూయిష్టంగా తయారైన పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీపై దృష్టి సారించి తమ విద్యార్థుల భవిష్యత్త్ కాపాడాలని ఏపీ – తెలంగాణ రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. సమస్యను తప్పక పరీష్కరించి విద్యార్థుల భవిష్యత్త్ కాపాడతానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!