Yanamala: ప్రాజెక్టులు పూర్తి చేయక.. ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు..
- ఐదేళ్ల విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయి..
- ఏపీ ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నిదర్శనం..
- ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారు: యనమల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు. సంక్షోభంలో ఉన్న ఏపీ ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 వివరంగా తెలియజేస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయింది. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారు అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.
Read Also: Fish Viral video: రైలు కాదు.. పట్టాలపై తిరుగుతున్న చేపలు! వీడియో వైరల్
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఇక, వైఎస్ జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్య్స ఆక్వా రంగం బలైంది టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకారు అని మండిపడ్డారు. వైసీపీ నిర్వహణ లోపంతో ప్రభుత్వ ఆసుపత్రులను నరక కూపాలుగా తయారు చేశారు.. ఆరోగ్యశ్రీని, అనారోగ్య శ్రీగా మార్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, విద్యా, పర్యాటక రంగాలను గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని యనమల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?