నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళలోని వయనాడ్ బాధితుల కోసం 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి ఇవాళ (శుక్రవారం) అందజేసింది.
Satyakumar: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శానిటేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఎక్విప్మెంట్, డయాలసిస్ కేంద్రాలు లాంటి వాటిపై ఆడిటింగ్ చేపడతామన్నారు.
MLA Balakrishna: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇక, బస్సులోకి ఎక్కిన తర్వాత బాలకృష్ణ ఓ చిన్న పిల్లాడితో కాసేపు ముచ్చటించారు.
Atchannaidu: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు.
Bar Council of India Meets AP CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది.
RP Sisodia Sudden Inspection: విజయనగరం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందికి సాధారణ ఆదేశాలు ఇచ్చారు.
Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.