పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ డిజైనర్, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి.
Vijayawada Airport: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.
రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. సీఎం నివాసంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో సీఐఐ ప్రతినిధుల బృందం మీట్ కాబోతున్నారు.
Tirumala: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి (గురువారం) నుంచి శాస్త్రోక్తంగా స్టార్ట్ అయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకు వచ్చి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు కొనసాగించారు.
Atmakur Tragedy: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో కిడ్నాప్ కు గురైన ఇంటర్ విద్యార్థి లభ్యమైంది. ప్రేమ వ్యవహరంలో మూడు రోజుల క్రితం కాలేజీలో ఉన్న ఇంటర్ విద్యార్థి వాహిద్ ను నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు.
At Home: నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు.
వక్ఫ్ చట్ట సవరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు..