High Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని తన ఇంటికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాగా.. ఆయన ఇంటిని ముట్టడించడానికి టీడీపీ కార్యకర్తలు యత్నించారు. కీలక డాక్యుమెంట్లు తన నివాసంలో ఉండడంతో తీసుకెళ్లడానికి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చారు. అనంతరం తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి తిరిగి వెళ్లిపోయారు. పెద్దారెడ్డి అనుచరుడు, వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ప్రసాద్ రెడ్డి నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రెండు కార్లు , స్కూటర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కందిగోపుల మురళి ప్రసాద్ రెడ్డి గన్‌లు పట్టుకుని హల్‌చల్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు.
Read Also: AP CM Chandrababu: నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష