రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశం అంతా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠా ఉన్నట్లు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి నుంచి శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌ని హత్య చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ దివ్వల మాధురి మళ్లీ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని ఆయన మండిపడ్డారు. సరైన పరికరాలు లేకుండా చేశారని.. ఉద్యోగుల భర్తీని కూడా చేయలేదన్నారు.
CM Chandrababu: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం…
అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్టైల్ పాలసీపై చర్చించారు.
CM Chandrababu: తిరుపతిలోని శ్రీసిటీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీసిటీలోని 8 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది అని తెలిపారు.
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న రాజమండ్రి రూరల్ వేమగిరికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.