East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న రాజమండ్రి రూరల్ వేమగిరికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Students Died: అనకాపల్లి జిల్లాలోని కోటవుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Fibernet MD Suspend: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ అయ్యారు. ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనింది.
Employee Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై కసరత్తు కొనసాగుతుంది. విద్య, వైద్య శాఖలు మినహా 15శాఖల్లో బదిలీలు కొనసాగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విసన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ (15) విద్యార్థిని.. గత రెండు నెలలుగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన తోట చందు అనే యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు.
Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Pawan Kalyan: నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి కార్యక్రమం జరగనుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులకు ఇవాళ మాక్ పోలింగ్, రీ చెకింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు.