Home Minister Anitha: ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు ,ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని.. ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయన్నారు. క్షతగాత్రులను తక్షణమే హాస్పటల్స్‌కు తరలించామని మంత్రి తెలిపారు.
Read Also: AP Weather: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు!
Also Read
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
ప్రమాదం రోజు విజయవాడ నుంచి తాను రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి రాత్రి 12 ;30 కు చేరుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షతగాత్రులను పరామర్శించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారని.. తక్షణమే అధికారులతో సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సీఎం ప్రకటించిన 24 గంటలు గడవక ముందే ఎక్స్‌గ్రేషియా అందజేశామన్నారు. జగన్ ధర్నా చేయాలంటే చాలా ఉన్నాయన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడకు పిలిపించుకున్నారని.. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారా అంటూ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌లో 15 మంది మృతి చెందితే, 12 మందికే ఎక్స్ గ్రేషియా ఇచ్చారని విమర్శించారు. ముగ్గురికి ఇప్పటికి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని ఆరోపించారు.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!