ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అయ్యింది.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. జిత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు.. పెండింగ్లో ఉన్న కౌలు నిధులను త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు నారాయణ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజీనామాకు ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు అని స్పష్టం చేశారు.. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో.. నాకు ఉన్న ఇబ్బందులు, సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు.
ఏపీ ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు.. ఇప్పుడు బిల్లుల చెల్లింపులు చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.. 2014-19 నాటి బిల్లులు పెండింగులో ఉండగానే.. గత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారు.. తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఈ రోజు సీఆర్డీఏ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది.. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది.. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు..