Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. ఈ అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నది. పోటు మీదుంటే వరదని తనలోకి సముద్ర ఇముడ్చుకోదు.. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం మొదలైంది.
Rescue Operation: బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొల్లూరు దిగువ భాగంలో ఉన్న లంక గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ డ్యూడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటించారు.
CM Chandrababu Review Meeting: మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కో డివిజన్ కేటాయింపు చేశారు.
AP Governor: భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు.
Ramalingeswara Nagar: విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఏడోవ లైన్లో ఉన్న రిటైనింగ్ వాల్ లీక్ అవ్వడంతో కాలనీలోకి నీరు చేరింది. పోలీస్ కాలనీ వద్ద రిటైనింగ్ వాల్ లాక్స్ బ్రేక్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ముంప్పు ప్రాంతాల వారిని పునానవాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.
Power Boats In Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ వచ్చాయి. దీంతో బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ కొనసాగుతుంది.
Prakasam Barrage: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
Vijayawada Floods: విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది.