Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Video Viral: బెంగళూరులోని ఓ యంగ్ బిజినెస్ మ్యాన్ చేసిన వినూత్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిల్ హేమాద్రి అనే వ్యాపారవేత్త రోడ్డు గుంతను పూడ్చడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అతడు చేసిన పని నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ఈ వైరల్ వీడియోలో అఖిల్ హేమాద్రి ఎరుపు రంగు పోర్షే కారులో అక్కడికి చేరుకుని, గుంత ఉన్న రోడ్డును స్వయంగా మరమ్మతు చేశాడు.
Varun Chakaravarthy: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
తాను ప్రయాణిస్తున్న కారులో నుంచే సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని తీసి అదే కారు బోనెట్ పై మిశ్రమాన్ని తయారు చేయడం వీడియోలో కనిపిస్తుంది. సాధారణంగా ఎవరూ ఊహించని విధంగా కార్ బోనెట్ ను ఉపయోగించడం ఇక్కడ ప్రత్యేకంగా నిలిచింది. అలా మిశ్రమం సిద్ధమైన తర్వాత, ఆ గుంతలో వేసి సమంగా పూడ్చడానికి ప్రయత్నించాడు. అనంతరం బోనెట్ పై వేసిన షీట్‌ను తీసేసినప్పుడు, కారుకు ఎలాంటి నష్టం జరగలేదని చూపించాడు. అయితే ఇది కార్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించే PPF (పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్) గురించి తెలపడానికి చేసిన ప్రయత్నమని అర్థమవుతుంది.
Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!
ఈ వీడియోకు జతచేసిన క్యాప్షన్ లో వ్యక్తిగత బాధ్యతపై సందేశం ఇచ్చారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతిదీ ప్రభుత్వంపై ఆధారపడకూడదని పేర్కొన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో మార్పు రావాలంటే ప్రతి వ్యక్తి తన వంతు పాత్ర పోషించాల్సిందేనని సందేశం ఇచ్చారు. అలాగే ఈ వీడియో తన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా తీసినదేనని ఆయన స్పష్టం చేశాడు. అయితే వ్యాపార ప్రచారంతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యం కూడా ఉందని తెలిపాడు. బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై అనేకచోట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్లపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీనితో ఈ వీడియో మరింత చర్చకు దారి తీసింది.
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?