8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- Tecno నుంచి POP X 5G భారత మార్కెట్లో లాంచ్
- 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డిమెన్సిటీ 6400 ప్రాసెసర్
- 6500mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 8.18mm స్లిమ్ డిజైన్, బలమైన బిల్డ్ క్వాలిటీ
- 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
- ధర: రూ.15,999 (4GB), రూ.17,999 (6GB)
- ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO POP X 5G Launched: భారత మార్కెట్లో టెక్నో (TECNO) సంస్థ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పాప్ X 5G (TECNO POP X 5G) అధికారికంగా లాంచ్ అయ్యింది. మంచి బ్యాటరీ బ్యాకప్, బలమైన బిల్డ్ క్వాలిటీ, మెరుగైన కనెక్టివిటీపై దృష్టితో ఈ ఫోన్ రోజువారీ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా సౌకర్యవంతమైన కమ్యూనికేషన్ అందించేలా ప్రత్యేక ఫీచర్లను అందించింది.
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
- OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
ఈ టెక్నో POP X 5Gలో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే పనితీరు కోసం మీడియాటెక్ డిమెంసిటీ 6400 ప్రాసెసర్‌ను అందించారు. ఇంకా ఈ మొబైల్ 4GB, 6GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు మెమరీ పెంచుకొనే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ లో 6500mAh భారీ బ్యాటరీ ఉండగా.. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

అలాగే ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. బాడీ కేవలం 8.18mm మందంతో స్లిమ్‌గా ఉండటంతో పాటు, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం కెమెరా డిజైన్‌తో బలంగా తయారు చేశారు. ఈ ఫోన్‌లో ముఖ్యమైన ప్రత్యేకత ఫ్రీలింక్ కమ్యూనికేషన్ (FreeLink Communication) ఫీచర్. ఇది మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా సమీపంలోని డివైస్ లతో నేరుగా కనెక్ట్ అయ్యి కాల్స్, మెసేజింగ్, ఫైల్ షేరింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఓపెన్ ఏరియాలో సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఫీచర్ పనిచేస్తుంది.
Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!
సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16తో పాటు పలు AI ఫీచర్లు అందించారు. AI నాయిస్ క్యాన్సిలేషన్, AI రైటింగ్ అసిస్టెంట్, AI ఎరేసర్ 2.0, AI ఇమేజ్ ఎక్స్‌టెండర్ వంటి టూల్స్ వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!