Singh Nagar floods: విజయవాడ నగరంలోని సింగ్‌నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. దీని వల్ల సింగ్‌నగర్ పూర్తిగా నీట మునిగింది. ఇక, సింగ్ నగర్ లో వరద ఉధృతి ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
19 Trains Canceled: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రకటించారు.
Rescue Operation in Vijayawada: బెజవాడ నగరంలో వచ్చిన వరదలో 2 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. జి. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెళ్ళటూరు బ్రిక్స్ ఇండస్ట్రీ ఏరియాలో చిక్కుకున్న 48 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1-2 లక్షల క్యూసెక్కుల నీరు వాగుల్లో ద్వారా వచ్చే ప్రమాదముంది.. ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోంది.. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సూచనలున్నాయి.. దిగువ ప్రాంతాల్లో సహయక చర్యలు తీసుకుంటున్నాం.. బండ్స్ పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మున్నేరు వరద ఉదృతితో నేషనల్ హైవే పై వరద నీరు చేరింది. దీంతో నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారి పైకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవేపై వరద నీరు చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు.
ఏపీలో వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వర్షాలు, ముంచెత్తాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మొత్తమ్మీద ముంపు బారిన పడిన 294 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13, 227 మందిని ప్రభుత్వ పునరావాస శిబిరాలకు ప్రభుత్వం తరలించిందని పేర్కొన్నారు.
దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య వివాదానికి కారణమైన దివ్వెల మాధురి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణగా భావిస్తున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు.
భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.