CM relief fund: ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు.. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు కూడా సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి..
Read Also: Raj Tarun : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఈసారి ట్విస్ట్ వేరే లెవల్..
మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో సీఎం చంద్రబాబును కలిశారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. తమ ఒక్క రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.. రూ.10.60 కోట్లని వరద సాయంగా అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ.. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారు. విద్యుత్ పునరుద్దరించడంలో విద్యుత్ ఉద్యోగులు అద్బుతంగా పని చేశారు. వరద బాధితులకు సేవలతో పాటు.. వరద సాయం కింద ఒక్క రోజు జీతాన్ని ఇచ్చారు. చంద్రబాబు పడుతున్న కష్టానికి ఊడతా భక్తిగా విద్యుత్ ఉద్యోగులూ చేయూనిచ్చారనరి పేర్కొన్నారు మంత్రి గొట్టిపాటి రవి.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మరోవైపు.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నేతృత్వంలోని సర్వేపల్లి నియోజకవర్గ పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబును కలిశారు.. రూ. 2.97 కోట్ల మేర నిధులు వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు సోమిరెడ్డి నేతృత్వంలోని పారిశ్రామిక వేత్తలు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం.. seil semcorp థర్మల్ పవర్ ప్రాజెక్టు తరఫున మరో రూ.50 లక్షల విరాళం.. ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు నుంచి దాదాపు మరో రూ. 47 లక్షలు విరాళం కలిపి మొత్తం రూ. 2.97 కోట్లు సీఎం చంద్రబాబుకు అందజేశారు.. కనివినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఒక్క రోజులోనే 30-40 సెంటి మీటర్ల మేర వర్షం కురిసింది. కేంద్రం కూడా పెద్ద ఎత్తున స్పందించి సాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వరద సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సోమిరెడ్డి..
Read Also: Hyundai Alcazar 2024: ‘హ్యుందాయ్ అల్కాజార్’ నయా వెర్షన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ఇక, సీఎం చంద్రబాబును కలిశారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ… తమ వంతు సాయంగా వరద సాయం అందించారు ఎక్సైజ్ ఉద్యోగులు. మా శాఖ నుంచి రూ. 2.70 కోట్ల మేర వరదబాధితులకు సాయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు.