పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు…
రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని తెలిపారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
నగరి నియోజక వర్గంలో కీలక నేతగా ఉన్నర కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది వైసీపీ.. ఈ మేరకు లేఖను విడుదల చేశారు చిత్తురు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. కలసి కట్టుగా పార్టీనీ బలోపేతం చేయాలని, సమస్యలు వస్తే అందరూ కలసి వెళ్లాలని గురువారం జరిగిన చిత్తూరు జిల్లా వైసీపీ నేతలను సూచించారు పార్టీ అధినేత వైఎస్ జగన్.
రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకోడానికి ఆపరేషన్ కొనసాగుతుంది. దివాస్ చెరువు అటవీప్రాంతాలలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి కదలిక చిత్రాలు గుర్తించారు. చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుతపులి పాదముద్రాలు కనుగొన్నారు. చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను కొన్ని ప్రదేశాలలో అమర్చారు..