AP CM Chandrababu: ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువురి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.…
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి.. పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు.
వరద నష్టంపై తొలిసారి భేటీకానుంది కేబినెట్ సబ్ కమిటీ... ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని ప్రసాద్, వంగలపూడి అనిత. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టం అంచనాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ల నష్టం అంచనాలపై చర్చించనుంది కేబినెట్ సబ్ కమిటీ..
ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
నెల్లూరు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రిని కుమారుడు దారుణంగా హత మార్చిన ఘటన జరిగింది.. స్థానికంగా నివసించే పాలెపు వెంకటేశ్వర్లు... ఆయన కుమారుడైన శివాజీకి గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతోంది.
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని భూసాయవలస వద్ద మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది.. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం.. ఓ వ్యాన్‌ను ఢీ కొట్టింది.
ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఈ ఏడాదిలో ఈ రోజు నాల్గోసారి ఎత్తారు నీటిపారుదలశాఖ అధికారులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం రోజే శ్రీశైలం గేట్లను మూసివేశారు అధికారులు.. అయితే, మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరడంతో.. ఈ రోజు శ్రీశైలం డ్యామ్‌లోని ఒక గేటును ఎత్తారు.. ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడిచిపెడుతున్నారు..
గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.