వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ అన్నారు.. ఇది కరెక్ట్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు... కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో.. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, విచారణకు సహకరించాలని వైసీపీ నాయకులకు షరతు పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కువైట్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతోన్న కవిత.. స్వదేశానికి చేరుకుంది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన మహిళ తిరుపతి కవిత... బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడిన బాధితురాలు..
విధి నిర్వహణలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తు విధులకోసం వచ్చిన.. ఏఆర్ కానిస్టేబుల్ చంద్రా నాయక్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. సహచరులు ఎంతో శ్రమించి సీపీఆర్ చేసి కాపాడాలని ప్రయత్నించినా ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ (పీసీ 3570) అకాలమరణం చెందడం అత్యంత విషాదకరం అన్నారు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా రూ.90 కోట్ల 84 లక్షలు నిధులు అందించడానికి సమ్మతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆయుష్ విభాగానికి సమాచారం అందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. 2019-24 కాలంలో ఆయుష్ విభాగానికి కేవలం రూ. 38 కోట్లు మాత్రమే కేంద్ర నిధులు లభించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ విజ్ఞప్తి…
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు..