చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అల్లూరి జిల్లాలోని సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరంకు జిల్లాకు చెందిన 8 మంది శనివారం సరియా జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు. ఒకరు జలపాతంలో గల్లంతవ్వడంతో అతడిని రక్షించేందుకు ఇద్దరు నేవీ ఉద్యోగులు ప్రయత్నించారు.
ముంబయి నటి కాదంబరి జేత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జేత్వాని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు.
నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద.
రూ. 2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడు గోపిచంద్ మృతదేహం లభ్యమైంది. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత గోపిచంద్ మృతదేహం దొరికింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గల మున్నేరులో గోపిచంద్ గల్లంతైన సంగతి తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని ఆరోపించారు . దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు.
విశాఖకు "వందేభారత్" రైళ్లు క్యూ కడుతున్నాయి. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు ప్రారంభంకాబోతోంది.. భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ ది ప్రత్యేక స్థానం. విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష దాటుతుంది. అదే సెలవులు, పర్వదినాల్లో అయితే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు. అయితే, డిమాండ్ కు అనుగుణంగా రైళ్ల ఫ్రీక్వెన్ని వుండటం లేదనే విమర్శలు బలంగా వుండేవి. కానీ, వందేభారత్ ఎంట్రీ తర్వాత విశాఖ రైలు…
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి జిల్లా ఆస్పత్రి పనితీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఇయన.. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అయితే, ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేశారు..