విజయవాడ గ్రామీణం నున్న పంచాయతీ పరిధిలోని పవర్ గ్రిడ్ సెంటర్ శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లీవ్ అపార్ట్మెంట్లో నెలకొల్పిన వినాయక విగ్రహం విపోధా ఫిస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేడుకల చివరి రోజును నిర్వహించి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని రూ 26 లక్షలకు సొంతం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒక సమస్యపై దృష్టి పెట్టిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం విధానానని స్పష్టం చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయంగా ఉంచుతారా, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారో చెప్పాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడలో గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి గ్యాస్ లారీ దూసుకెళ్లింది. దుకాణం ఎదుట పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందికు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది.
Minister Narayana: విజయవాడలో వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది.. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు..
Minister Dola: బుడమేరు మళ్లీ కొట్టుకు పోతుందని సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలో వరద బాదితుల పరిస్దితులు మెరుగయ్యాయి.. ఓ ముఖ్యమంత్రిగా బాధితుల కోసం నాలుగు గంటలు జేసీబీ మీద ప్రయాణించిన చిత్తశుద్ది మా సీఎందే.. వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లి బాదితులకు సహాయం చేశారాని ఆయన పేర్కొన్నారు.
Prakasam Barrage: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరవ రోజు కొనసాగుతుంది. డబుల్ ఐరన్ రోప్ పను డోజర్ కు కనెక్ట్ చేసి బోట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోడ్ హెవీ కావడంతో లోడ్ యాక్సిల్ విరిగిపోయింది. ఇవాళ సరాసరి భూమిలోకి వేసిన స్తంభానికి కనెక్ట్ చేసి డోజర్ తో లాగే ప్రయత్నం చేస్తున్నారు.