విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తాం అంటున్నారు.. రాజీనామాలు అవసరం లేదు.. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెబితే చాలు అంటూ కూటమి నేతలకు సలహా ఇచ్చారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. రావులచెరువులో ఓ ఇంట్లో బాణా సంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవిచింది.. అప్పటికే నిల్వ చేసిన బాణాసంచా ఓవైపు.. తయారీ చేస్తున్న టపాసులు మరోవైపు ఉండడంతో.. జరిగిన ఈ ప్రమాదంలో పెట్ట నష్టం జరిగింది.. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. స్టీల్ ప్లాంట్ వైసీపీకి రాజకీయం.. కానీ, మాకు సెంటిమెంట్ అని స్పష్టం చేశారు.. తెలుగుదేశం పార్టీ దయతో ఎమ్మెల్సీగా గెలిచిన ఓ సీనియర్ నేత.. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు చేస్తున్నారు... కానీ, స్టీల్ ప్లాంట్ కోసం నా రాజీనామా ఆమోదించకుండా మూడేళ్లు కాలయాపన చేశారు అని దుయ్యబట్టారు.
సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. ఏలూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్ర పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.. పోటీలకు విచ్చేసిన బాడీ బిల్డర్స్ గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కావడంతో, ఏలూరు ప్రభుత్వ వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు..
ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు.. రాజకీయ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు.. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి.. కానీ, గిరిజనుల కృష్టాలు తీరడం లేదు.. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిలను ఆస్పత్రికి తరలించాలంటే కష్టమే.. మరోవైపు.. కన్నుమూసినవారికి అంత్యక్రియలు నిర్వహించడానికి సొంత గ్రామానికి చేర్చాలన్నా ఆపసోపాలు తప్పడంలేదు..
రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు కనిపించాయి. చిరుత పులి ప్రస్తుతం దివాన్ చెరువు అటవీప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. చిరుతపులి కదలికలను గుర్తించు నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఉపయోగిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏ పేరుతో ఫోన్ చేసి.. ఎలా ట్రాప్ చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు ఏ కంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు పేరు మీద.. అతడికి తెలియకుండానే పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు కేటుగాళ్లు.. తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూప్ కుమార్‌కు తెలియకుండా.. అతడి పేరు మీద ఏకుండా రూ.13.8 లక్షలు లోన్ కాజేశారు సైబర్ నేరగాళ్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్ వెళ్లనున్నారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..