BCB: వరల్డ్ కప్ బహిష్కరణపై బంగ్లాదేశ్‌లో గందరగోళం.. ఎవరు బ్యాన్ చేయమన్నారో నో క్లారిటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh T20 World Cup Boycott Confusion: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో గందరగోళం నెలకొంది. ఇంతకీ టీ20 వరల్డ్ కప్‌ను ఎవరు చెబితే బహిష్కరించారు? అనేది వాళ్లకే తెలియడం లేదు! ఓవైపు ప్లేయర్స్ నిర్ణయం మేరకే బ్యాన్ చేశామని చెబుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వం వల్లే వెనుదిరిగామని వాదిస్తున్నారు. అయితే.. ఒక రోజు ముందు మీడియాతో చెప్పిన మాటలకు మరుసటి రోజు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌కు వచ్చింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన నజ్రుల్, వరల్డ్ కప్ ఆడొద్దని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆటగాళ్లే నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్య వెంటనే చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇంతకుముందు భద్రతా కారణాల వల్ల ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మంగళవారం నజ్రుల్ మాట మార్చడంతో అసలు ఈ నిర్ణయం ఎవరిది? ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విమర్శల మధ్య బుధవారం నజ్రుల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. “వరల్డ్ కప్‌లో ఆడకూడదనే నిర్ణయం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది” అని మరోసారి మాట మార్చాడు. బీసీబీ, ప్లేయర్స్ వల్ల మ్యాచ్ బహిష్కరించినట్లు తాను చెప్పలేదని, తన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని కవర్ చేశాడు.
READ MORE: Lavanya Tripathi : మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను.. ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన లావణ్య
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
నజ్రుల్ తాజాగా బుధవారం చెప్పిన వివరాల ప్రకారం.. జనవరి ప్రారంభంలోనే భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌కు జట్టును పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని తాను గతంలోనూ పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. మొదటి వ్యాఖ్యలో బీసీబీ, ఆటగాళ్లే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడంతో పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం బాధ్యతను బోర్డుపైకి నెట్టిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజా వివరణలో నజ్రుల్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బోర్డు, ఆటగాళ్లు ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారని చెప్పారు. వరల్డ్ కప్ బహిష్కరణ వల్ల ఆర్థిక నష్టాలు, మ్యాచ్‌ల కోత, శిక్షల అవకాశాలు ఉన్నప్పటికీ వారు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. జాతీయ భద్రత, గౌరవం దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి తోడుగా నిలిచిన కీర్తి వారిదే కొనియాడారు. ఈ వ్యాఖ్యలతో వరల్డ్ కప్‌ను బహిష్కరించమని ఎవరు చెప్పారో వాళ్లకే క్లారిటీ లేదని స్పష్టమవుతోంది!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!