పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు, వాటి పరిధిలో ఉండే ఉపాధ్యాయులు మరణిస్తే వారి వారసులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. తన కార్యాలయానికి కారుణ్య నియామకాలుపై పలు అర్జీలు వస్తున్న దృష్ట్యా డిప్యూటీ సీఎం ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు.
ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.. పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు తీసుకు రావాలన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ అల్లుడు సొంత మేనత్త ఇంటికి కన్నం వేశాడు. పెళ్లి సంబంధం కోసం వచ్చి మేనత్త ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన ఘటన పార్వతీపురం మండలంలో గల పెదబొండపల్లిలో జులై 27న జరిగింది.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు అందజేయగా.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు.
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.