తిరుమల వ్యవహరం జగన్కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు.
తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని కృష్ణా నది, బుడమేరు వరద అతలాకుతలం చేసింది.. పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్ట పరిహారం పంపిణీపై దృష్టిసారించింది.. ఈ రోజు నాలుగు లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ. 602 కోట్లు జమచేసింది ప్రభుత్వం..
వరద సాయం ఏ మేరకు అందిందనే అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఇంకా సెటిల్ కాని క్లైమ్లను ఈ నెల 30వ తేదీలోగా సెటిల్ చేయాలని ఆదేశించారు.. ఈ నెల 30వ తేదీని డెడ్ లైన్గా పెట్టుకుని పని చేయాలన్నారు.. వరద ముంపులో దెబ్బతిన్న వాహనాల భీమా క్లెయిమ్ల చెల్లింపు, మరమ్మతులు, గృహోపకరణాల మరమ్మతులు, బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ పై చర్చ సాగింది.. 11 వేల వాహనాల క్లెయిమ్లు వచ్చాయని సీఎంకు తెలిపారు అధికారులు..…
వరద బాధితులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో వేశామని తెలిపారు..
భీమిలి ఎర్రమట్టి దిబ్బలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టులో పిల్ (WP(PIL) 155/2024) దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్.. దీనిపై విచారణ జరిగిన ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (CRZ) జోన్-1, జోన్-3 మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) గల సున్నితమైన పరధిలోనికి వస్తుందని పేర్కొంది..