Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. 4 వేల మంది కార్మికులు ఔట్..!
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం..
- ఓవైపు సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు..
- కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం..
- నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.. ఓవైపు సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది.. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ కానున్నారు.. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది.. బయో మెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు తొలగించారు.. బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్ ఇచ్చారు.. దీని కోసం 14 వేల కోట్లు కేటాయించిన RINL. ఇక, 500 మందిని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, ఇదంతా ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంగా చెబుతోంది ఆర్ఐఎన్ఎల్.. కానీ, మరోసారి ఆందోళన బాటపట్టాయి కార్మిక సంఘాలు.. నేడు ట్రైనింగ్ సెంటర్ దగ్గర భారీ ధర్నాకు పిలుపునిచ్చారు..
Read Also: Megastar Chiranjeevi: మెగాస్టార్‌ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
అయితే.. వైజాగ్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందంటూ వార్తలు వచ్చాయి.. కార్మిక పోరాటాలు, పొలిటీకల్ లాబీయింగ్ స్టీల్ ప్లాంట్ పరి రక్షణ దిశగా కీలకంగా మారాయని.. దీంతో తెగనమ్మేయాలనే ఆలోచనలకు ఎన్డీఏ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టే దిశగా దృష్టిసారించిందని.. ఆ దిశగా RINLను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తారనే సంకేతాలు బలంగా వినిపించాయి.. కాగా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉద్యమనాదమైన వేళ అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 32 మంది ప్రాణాలు అర్పించిన ఫలితంగా ఏర్పాటైన ఈ భారీ పరిశ్రమ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని నిలబడింది. అందుకే వైజాగ్ స్టీల్ అంటే ఒక ఇండస్ట్రీ కాదు సెంటిమెంట్.. ఆర్ధిక నష్టాల్లోకి నెట్టివేయబడిన ప్రతీసారీ సంక్షోభం నుంచి బయటపడి త న మనుగడను కాపాడుకుంటూనే వుంది. ఆ దిశగా సవాళ్లు, సమస్యలను అధిగమించి స్టీల్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్ధానం సాధించింది ఈ భారీ పరిశ్రమ. కాగా, ఇప్పుడు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కార్మికులు.. వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి..
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!