Tirupati Laddu Controversy: లడ్డూ ప్రసాదం కల్తీపై విచారణ.. నేడు తిరుపతికి సిట్ బృందం..
- తిరుమల లడ్డూ వివాదం.. రంగంలోకి సిట్..
- ఇవాళ తిరుపతిలో విచారణ జరపనున్న సిట్ టీమ్..
- ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలపై ఆసక్తి..
- సంచలనంగా మారిన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది.
Read Also: Hydra Commissioner: కూకట్‌పల్లి లో చనిపోయిన మహిళకు.. హైడ్రా తో ఎలాంటి సంబంధం లేదు..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీమ్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరుపనుంది. ఇవాళ తిరుపతికి సిట్ వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటేల్స్ తీసుకోనుంది. తొలుత AR డెయిరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు.. టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు.. ఆ కంపెనీల లావాదేవీలేంటి.. దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు లాంటి అంశాలపై సిట్ ఫోకస్ చేయనుంది. నెయ్యిపై గతంలో, రీసెంట్‌గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుంది. మరోవైపు.. టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో, మాజీ ఛైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉంది. చివరకు లడ్డూ వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో వాటిని పరిశీలించనుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?